Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారీ వర్షంతో గోడలు, పైకప్పు కూలిన ఇల్లు.. బాధితులను పరామర్శించిన సర్పంచ్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 06:54 PM

సోషల్ మీడియాతో పరిచయం.. యువతిని మోసం చేసిన ఎస్‌ఐ అరెస్ట్. లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు.. 14 రోజుల రిమాండ్

సోషల్ మీడియాతో పరిచయం.. యువతిని మోసం చేసిన ఎస్‌ఐ అరెస్ట్. లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు.. 14 రోజుల రిమాండ్

సోషల్ మీడియాతో పరిచయం.. యువతిని మోసం చేసిన ఎస్‌ఐ అరెస్ట్. లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు.. 14 రోజుల రిమాండ్
August 01, 2026 03:59 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హనుమకొండ, ఆగస్టు 1: సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని ఓ యువతిని మోసం చేసి, లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఎస్‌ఐ కదిరే శ్రీకాంత్ను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని సీఐ రంజిత్ కుమార్ వెల్లడించారు.

హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని నిజామాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, హనుమకొండ మూడో అదనపు న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.

ఈ సందర్భంగా సీఐ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు పెంచుకునే విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News