Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:04 PM

ఎస్సీ వర్గీకరణ జీఓలు రద్దు చేయాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మాల మహానాడు వినతి.

01-08-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోస్టర్ పాయింట్లలో అన్యాయం జరిగిందని ఆవేదన.. సవరణ వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలని డిమాండ్

నల్గొండ, ఆగస్టు 01,

ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ మాల మహానాడు ప్రతినిధులు శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నల్గొండలో కలిసి వినతిపత్రం సమర్పించారు. వర్గీకరణ అమలు వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, రోస్టర్ పాయింట్ల కేటాయింపులో లోపాల కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం–2025, దానికి సంబంధించిన జీఓల వల్ల మాలలు, వారి 25 ఉపకులాలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. 100 పాయింట్ల రోస్టర్‌లో ప్రారంభ పాయింట్లలో మాలలకు అవకాశం కల్పించకపోవడంతో చిన్న, మధ్యస్థాయి ఉద్యోగ నియామకాల్లో ప్రాతినిధ్యం లేకుండా పోతోందని తెలిపారు.

'రిజర్వేషన్ ఉన్నా.. ఉద్యోగం దక్కని పరిస్థితి'

పోలీసు శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో 5 నుంచి 15 పోస్టులతో వెలువడే నియామకాల్లో మాల అభ్యర్థులకు ఒక్క పోస్టు కూడా దక్కే అవకాశం లేకుండా పోతోందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

మూడు ప్రధాన డిమాండ్లు

ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీఓలను వెంటనే రద్దు చేయాలి.

రోస్టర్ పాయింట్లను పునఃపరిశీలించి ప్రారంభ పాయింట్లలో మాలలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.

రోస్టర్ సవరణ పూర్తయ్యే వరకు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను నిలిపివేయాలి.

వినతిపత్రంలోని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు మాల మహానాడు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతపల్లి లింగమయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎన్నమల్ల అనిల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతపల్లి బాలకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యుడు చింతపల్లి వెంకన్న, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి అభినవ్, జిల్లా నాయకులు అనుముల పూరి సుధాకర్, రావిరాల వరప్రసాద్, బోగరి రవీందర్, ఎర్నమల్ల ప్రభాకర్‌తో పాటు మాల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్సీ వర్గీకరణ జీఓలు రద్దు చేయాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మాల మహానాడు వినతి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News