Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

ఆందోల్‌ మైసమ్మ ఆలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

02-08-2026 158 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీ ఆందోల్‌ మైసమ్మ దేవస్థానంలో 21వ బోనాల ఉత్సవాలు ఆదివారం వైభవంగారిగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. అనంతరం శ్రీ ఆందోల్‌ మైసమ్మ తల్లి, ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లుల ఉత్సవ విగ్రహాలకు గ్రామసేవ, రథోత్సవం కంటికింపుగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లకు ఆలయ చైర్మన్ కంచర్ల అశ్విని రెడ్డి, కార్యనిర్వాహణాధికారి (ఈవో) సల్వాది మోహన్ బాబులు ‘సర్కార్ బోనం’ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​పోటెత్తిన భక్తజనం ​రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో మైసమ్మ తల్లి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించి నైవేద్యాలు అందించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. దాతలు కొమిరిశెట్టి విజయ్ కుమార్ - శిరీష దంపతులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. భక్తులు క్యూలైన్లలో క్రమశిక్షణతో అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ​ఈ కార్యక్రమంలో సర్పంచ్ గిర్కటి నిరంజన్, మాజీ సర్పంచ్ పబ్బు రాజు గౌడ్, చౌటుప్పల్ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, ధర్మకర్తల మండలి సభ్యులు ఈడుదుల బాబు, బేతాళ నరసింహ, సిద్దిపేట ఆనందరెడ్డి, వెంకిర్యాల శివ, బాలగోని శ్రీకాంత్ గౌడ్, బొంతల యువరాజ్, మన్నే మహేందర్ రెడ్డి, దౌడీ రాజేష్, పన్నాల మహేందర్ రెడ్డి, ధేప రాజీవ్, పంతంగి రమేష్, జొన్నగంటి దాసు, చిట్టెంపల్లి సబిత, వల్లూరి శివప్రసాద్ శర్మ, గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఆందోల్‌ మైసమ్మ ఆలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News