Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

బాలల సభలో విద్యార్థులకు విలువైన అవగాహన కల్పించిన; సర్పంచ్ మల్లేష్

02-08-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం సంగెం గ్రామ పాఠశాలలో బాలల గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి సర్పంచ్ కలకోట్ల మల్లేష్ పాల్గొని మాట్లాడుతూ... బాలలసభ అనేది మనలోని ప్రతిభను వెలికితీసే వేదిక. ఇక్కడ ప్రసంగాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మన ఆత్మవిశ్వాసం పెరుగుతుందనీ అన్నారు. అలాగే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమయపాలన మరియు వేదికపై మాట్లాడే నైపుణ్యం కూడా అభివృద్ధి చెందుతాయనీ అన్నారు.విద్యార్థులు బాగా చదవడంతో పాటు మంచి నడవడి, పెద్దల పట్ల గౌరవం, ఉపాధ్యాయుల పట్ల మర్యాద, తోటి విద్యార్థులతో స్నేహభావం కలిగి ఉండాలనీ. మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనం, ఆటలు మరియు సృజనాత్మక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాలనీ అన్నారు.

పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడం, మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడడం మరియు సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడం ప్రతి విద్యార్థి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

బాలల సభలో విద్యార్థులకు విలువైన అవగాహన కల్పించిన; సర్పంచ్ మల్లేష్

Article Image

తుంగతుర్తి మండలం సంగెం గ్రామ పాఠశాలలో బాలల గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి సర్పంచ్ కలకోట్ల మల్లేష్ పాల్గొని మాట్లాడుతూ... బాలలసభ అనేది మనలోని ప్రతిభను వెలికితీసే వేదిక. ఇక్కడ ప్రసంగాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మన ఆత్మవిశ్వాసం పెరుగుతుందనీ అన్నారు. అలాగే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమయపాలన మరియు వేదికపై మాట్లాడే నైపుణ్యం కూడా అభివృద్ధి చెందుతాయనీ అన్నారు.విద్యార్థులు బాగా చదవడంతో పాటు మంచి నడవడి, పెద్దల పట్ల గౌరవం, ఉపాధ్యాయుల పట్ల మర్యాద, తోటి విద్యార్థులతో స్నేహభావం కలిగి ఉండాలనీ. మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనం, ఆటలు మరియు సృజనాత్మక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాలనీ అన్నారు.

పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడం, మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడడం మరియు సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడం ప్రతి విద్యార్థి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News