Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

ముర్రుపాలే శిశువుకు తొలి రక్షణ కవచం

ముర్రుపాలే శిశువుకు తొలి రక్షణ కవచం

ముర్రుపాలే శిశువుకు తొలి రక్షణ కవచం
02-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెద్దకాపర్తిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాల ప్రారంభం – తల్లిపాల ప్రాధాన్యంపై అధికారుల అవగాహన.

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సెక్టార్ పరిధిలోని పెద్దకాపర్తి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ మునుగోడు ప్రాజెక్టు సీడీపీవో లావణ్య కుమారి, సెక్టార్ సూపర్‌వైజర్ నాగమణి పాల్గొని తల్లిపాల విశిష్టతను గర్భిణీలు, బాలింతలకు వివరించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు పట్టించడం అత్యంత అవసరమని సూచించారు. ముర్రుపాలు (కొలస్ట్రం) శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని అందించి వివిధ అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయని తెలిపారు. జననం నుంచి తొలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించడం ద్వారా శిశువు ఆరోగ్యవంతంగా ఎదుగుతాడని వివరించారు.కార్యక్రమంలో సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, ఆయాలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పొందారు. అధికారులు తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారమని, ప్రతి తల్లి ఈ విషయాన్ని బాధ్యతగా పాటించాలని పిలుపునిచ్చారు.

Sthanikam

ముర్రుపాలే శిశువుకు తొలి రక్షణ కవచం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News