సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప (22) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడి కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని దించారని ఆరోపిస్తూ గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో వట్పల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన కొందరు పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి ఫర్నీచర్, కిటికీల అద్దాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీరప్ప మృతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
PRINT TIME: September 21, 2026 09:12 PM
యువకుడి మృతిపై ఆగ్రహం.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు

01-08-2026
175 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప (22) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడి కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని దించారని ఆరోపిస్తూ గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో వట్పల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన కొందరు పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి ఫర్నీచర్, కిటికీల అద్దాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీరప్ప మృతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి