Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

స్నేహమంటే ఇదేరా..! 25 ఏళ్లుగా చెక్కుచెదరని ‘కలం స్నేహితుల’ అనుబంధం.

02-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్నేహితుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఆత్మీయ సమ్మేళనం.

హైదరాబాద్, ఆగస్టు 2 (స్థానికం ప్రతినిధి):

కాలం మారినా, సాంకేతికత పెరిగినా నిజమైన స్నేహానికి కాలపరిమితి ఉండదని ‘కలం స్నేహితులు’ మరోసారి నిరూపించారు. దాదాపు 25 ఏళ్ల క్రితం వండర్ వరల్డ్ మాసపత్రికలో నిర్వహించిన ‘కలం స్నేహం’ శీర్షిక ద్వారా ఉత్తరాల ద్వారా పరిచయమైన సుమారు 35 మంది నేటికీ తమ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

సోషల్ మీడియా లేని రోజుల్లో దినపత్రికలు, మాసపత్రికలు, సాహిత్య వేదికలే పరిచయాలకు వారధిగా నిలిచేవి. ఆ సమయంలో వండర్ వరల్డ్ మాసపత్రికలోని ‘కలం స్నేహం’ విభాగం ద్వారా ఏర్పడిన పరిచయాలు క్రమంగా స్నేహంగా మారాయి. అనంతరం శరత్ ఆధ్వర్యంలో ‘కలం స్నేహం అసోసియేషన్’ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో సమావేశమవుతూ పరస్పర యోగక్షేమాలు తెలుసుకుంటూ వస్తున్నారు.

ఈ అసోసియేషన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఉన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం హైదరాబాద్‌లోని నాగోల్‌లో సుమారు 22 మంది స్నేహితులు ఆత్మీయంగా కలుసుకున్నారు.

తిరుపతి, కడప, కర్నూలు, నిజామాబాద్, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సంతోషంగా గడిపారు. ఉత్తరాలతో ప్రారంభమైన ఈ స్నేహబంధం పాతికేళ్లుగా కొనసాగుతుండడం విశేషమని సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు సన్మానించుకుని భవిష్యత్తులోనూ ఇదే అనుబంధాన్ని కొనసాగించాలని సంకల్పించారు.

Sthanikam

స్నేహమంటే ఇదేరా..! 25 ఏళ్లుగా చెక్కుచెదరని ‘కలం స్నేహితుల’ అనుబంధం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News