గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా సదాశివపేటలోని ఊబ చెరువు వద్దకు వెళ్తున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్‌కు శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1.15 గంటల సమయంలో నందికంది గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–65పై రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసింది.వెంటనే స్పందించిన ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించారు.పోలీసు సిబ్బంది, స్థానికుల సహకారంతో క్షతగాత్రులను పోలీసు వాహనం, అంబులెన్స్‌ల ద్వారా చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కంది గ్రామానికి చెందిన శివలీల, ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బి. సంతోష్, బీదర్ జిల్లాకు చెందిన బైక్ రైడర్ ఎన్. అమర్ గాయపడినట్లు తెలిపారు.ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి గాయపడిన వారికి ఎస్పీ స్వయంగా సహాయం అందించడం పట్ల స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు జిల్లా ఎస్పీ తక్షణ సాయం

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి