చాదర్‌ఘాట్, సెప్టెంబర్ 18:
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని చాటిచెప్పేలా చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానంద్ నగర్‌లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాలగంగాధర్ తిలక్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు బిపిన్ సిద్ధార్థ్, మహేష్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజల కోసం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీసీపీ మజీద్, ఏసీపీ రాజ్ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. పీస్ కమిటీ ప్రెసిడెంట్ ప్రతినిధి నారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు. ముఖ్య అతిథులు తమ చేతుల మీదుగా అన్నప్రసాద వితరణను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాలకు పోలీసు శాఖ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు, ప్రముఖ నాయకులు అజీజ్ ఖాద్రీ, పోలీస్ శాంతి కమిటీ సభ్యులు, దయానంద్ నగర్ ప్రాంత ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి