రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన ఉడతల శ్రీను తల్లి సుక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మునిపంపుల గ్రామానికి చేరుకుని సుక్కమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, పల్లివాడ, ఇంద్రపాలనగరం సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, గర్దాస్ విక్రమ్, మాజీ ఎంపీటీసీ, సర్పంచులు గాదె పారిజాత, డోగ్గిపర్తి జానకి రాములు, రేఖ యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మామిళ్ల అశోక్, ఉప సర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్ పాల్గొన్నారు.
అలాగే నాయకులు బత్తుల వెంకన్న, ఆవుల నరేందర్, మామిడి పాండురెడ్డి, మామిళ్ల కుమార్, ఆవుల శ్రీధర్, వార్డు సభ్యులు మేకల రాములు, కూనూరు లక్ష్మమ్మతో పాటు కాయ యాదయ్య, గుండాల గణేష్, కూనూరు లింగస్వామి, ఎడవెల్లి నరసింహ, యాదయ్య, వెంకన్న, శంకర్ తదితరులు పాల్గొని సుక్కమ్మ మృతదేహానికి నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి