Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 09:11 PM

మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు అస్వస్థత.. 20 మంది ఆసుపత్రికి తరలింపు

17-09-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మునిపల్లి మండలం పెద్దలోడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తినట్లు ప్రధానోపాధ్యాయురాలు సునీత తెలిపారు.విషయం తెలుసుకున్న రాయికోడ్ 108 సిబ్బంది వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని తమ పిల్లల పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. విద్యార్థులు అస్వస్థతకు గురైన కారణాలపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Sthanikam

మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు అస్వస్థత.. 20 మంది ఆసుపత్రికి తరలింపు

Article Image

మునిపల్లి మండలం పెద్దలోడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తినట్లు ప్రధానోపాధ్యాయురాలు సునీత తెలిపారు.విషయం తెలుసుకున్న రాయికోడ్ 108 సిబ్బంది వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని తమ పిల్లల పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. విద్యార్థులు అస్వస్థతకు గురైన కారణాలపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News