Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 06:58 PM

ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ

17-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొనసాగిందని, అనంతరం సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని ఎస్పీ తెలిపారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడం, సమానత్వం, న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఉద్యోగంలో చేరిన తొలి రోజున ఉన్న సేవాభావంతోనే చివరి వరకు ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ బి. రమేష్, ఇన్‌స్పెక్టర్లు నాగేశ్వర్ రావు, రామకృష్ణ రెడ్డి, రామునాయుడు, నగేష్, ఆర్‌ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియేల్, ఎస్‌బీ, డీసీఆర్‌బీ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News