Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 02:35 PM

రూ.5 లక్షల లంచం.. కీసర సీఐ, ఎస్‌ఐ ఏసీబీకి చిక్కారు

17-09-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బెయిల్‌ కోసం రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు.

కీసర: రేషన్‌ బియ్యం కేసులో నిందితులకు బెయిల్‌ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. కీసర చెరువు వద్ద రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కినట్లు తెలిసింది.

రేషన్‌ బియ్యం కేసులో నిందితులను బెయిల్‌ కోసం సీఐ, ఎస్‌ఐలు లంచం డిమాండ్‌ చేసినట్లు బాధితులు ఆరోపించారు. కొంతకాలంగా నిందితులతో వివిధ పనులు చేయించుకోవడంతో పాటు బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌ తీసుకురావాలని సీఐ వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. కెమికల్‌ టెస్టులు చేయించకుండా కేసు విషయంలో ముప్పుతిప్పలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.ఈ వేధింపులతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది. పక్కా ప్రణాళికతో కీసర చెరువు వద్ద లంచం అందజేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసినట్లు సమాచారం. అధికారులు వస్తున్న విషయాన్ని గమనించిన ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి అక్కడి నుంచి పరుగులు తీసినప్పటికీ ఏసీబీ బృందం పట్టుకున్నట్లు తెలిసింది.

గణేష్‌ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న సమయంలోనే లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Sthanikam

రూ.5 లక్షల లంచం.. కీసర సీఐ, ఎస్‌ఐ ఏసీబీకి చిక్కారు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News