అమీన్‌పూర్, సెప్టెంబర్ 16: అమీన్‌పూర్‌లోని శిల్ప కాలనీలో గణపతి సప్తాహ్నిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బుధవారం కాలనీ పార్కులో కాలనీవాసుల ఆధ్వర్యంలో ఉదయం గణపతి హోమం, సాయంత్రం చిన్నారులచే సరస్వతి పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో కొనసాగిందని శిల్ప కాలనీ గణేష్ ఫెస్టివల్ కమిటీ సభ్యులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి