సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఆవిష్కరణకు భజరంగ్ దళ్ పిలుపు
సెప్టెంబర్ 17న ప్రతి వినాయక మండపం వద్ద జాతీయ జెండాను గౌరవంగా ఎగురవేసి, దేశభక్తిని, జాతీయ ఐక్యతను చాటాలని భజరంగ్ దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ గోగు రవి పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పురపాలక పరిధిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూనే, మన జాతీయ జెండాకు తగిన గౌరవం తెలియజేయాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులందరూ కలసి వందేమాతరం గేయాన్ని ఆలపించాలని ఆయన సూచించారు. చిన్ననాటి నుంచే పిల్లలు, యువతలో దేశభక్తి భావాలను, జాతీయ సమైక్యతా దృక్పథాన్ని పెంపొందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి