Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాఠశాల ఆవరణలో మద్యం బాటిళ్లు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 11:43 AM

పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి సీపీ సుమతి

16-09-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజిగిరి: పోలీసుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమన్వయంతో పనిచేయాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి సూచించారు. మంగళవారం నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు సీపీ సుమతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

ఈ సందర్భంగా సీపీ సుమతి నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో పోలీసు అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీసుల సంక్షేమం, వారి కుటుంబాల అభ్యున్నతికి అసోసియేషన్ చేపట్టే కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

నూతన కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు సీపీకి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాకేష్, రామస్వామి, నీలవేణి, సెక్రటరీ డి. నవీన్ కుమార్, జాయింట్ సెక్రటరీ బాలరాజు, అసిస్టెంట్ సెక్రటరీలు సుబ్బరాజు, పలుగుల శ్రవణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు మల్లేష్, బీరయ్య, విజయ్, రామకృష్ణ గౌడ్, ట్రెజరర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి సీపీ సుమతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News