మానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయిపల్లి గ్రామ శివారులో సిరూర్–రాయిపల్లి వంతెన సమీపంలోని సిగూర్ బ్యాక్‌వాటర్‌లో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. నీటిలో మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహంపై నలుపు రంగు దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు గుర్తింపు కోసం చర్యలు చేపట్టారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
PRINT TIME: September 15, 2026 03:01 PM
రాయిపల్లి శివారులో కలకలం.. బ్యాక్‌వాటర్‌లో మృతదేహం

15-09-2026
219 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
మానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయిపల్లి గ్రామ శివారులో సిరూర్–రాయిపల్లి వంతెన సమీపంలోని సిగూర్ బ్యాక్‌వాటర్‌లో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. నీటిలో మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహంపై నలుపు రంగు దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు గుర్తింపు కోసం చర్యలు చేపట్టారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి