నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు అధ్యక్షులు దేప శ్యాంసుందర్ ముదిరాజ్
దండు మల్కాపూర్ గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్వామి పూజా కార్యక్రమం అధ్యక్షులు దేప శ్యాంసుందర్ ముదిరాజ్ సమక్షంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మాట్లాడుతూ... గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఊరిలో శాంతి, ఐకమత్యం ఎల్లప్పుడూ నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నేతాజీ యువజన సంఘం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ పూజా కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముదిగొండ మహేష్, ఉపాధ్యక్షులు రాచర్ల ఈశ్వర్, వార్డు మెంబర్ ఈడుదుల ఇంద్రసేన యాదవ్, సీనియర్ సభ్యులు నరసింహ గౌడ్, బుర్ర ముత్యాల గౌడ్, పబ్బు శ్రీనివాస్ గౌడ్, పటేల్ వెంకట్ రెడ్డి, దౌడి పెద్ద యాదగిరి, ఈడుదుల మస్తాన్ బాబు యాదవ్, దేప రాజు ముదిరాజ్, గుండ్ల అశోక్ ముదిరాజ్, ఈడుదుల బాబు యాదవ్, మొగిలి మహేందర్ రెడ్డి, నెల్లికంటి హరిప్రసాద్, ఈడుదుల కేశవ్ యాదవ్, దౌడి వెంకటేష్, నెల్లికంటి గురుప్రసాద్, ఈడుదుల నర్సింహా యాదవ్, బుర్ర శివ కుమార్ గౌడ్, దౌడి లింగస్వామి, వెనికిరాల శివ చారి, నెల్లికంటి శ్రీకాంత్, బుర్ర విజయ్ గౌడ్, చందుపట్ల సాయి నేత, పక్కిర్ ప్రభాకర్ రెడ్డి, బుర్ర శ్రీకాంత్ గౌడ్, పక్కిర్ వంశీధర్ రెడ్డి, పెంబళ్ల శ్రీకాంత్, బతరాజు శివక్రిష్ణ, దేవరాబోయిన సాయి యాదవ్, ముదిగొండ నరేష్, సందగళ్ల నవీన్ గౌడ్, కంచర్ల నవీన్ రెడ్డి, ముదిగొండ సాయి ఉజ్వల్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి