చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపిన కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, వార్డు ప్రజలు
తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గాంధీ పార్క్ వద్ద ఉన్న పెద్ద మోరీ పొంగిపొర్లడంతో, సమీప నివాసాల్లోకి మోకాళ్ల లోతు వరకు నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఉదయం 5 గంటలకే స్పందించారు. తక్షణమే మున్సిపల్ సిబ్బందిని, నీటిని తోడే పరికరాలను ఘటనా స్థలానికి పంపి నీటి తొలగింపు చర్యలు వేగవంతం చేశారు.సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపిన మున్సిపల్ చైర్మన్ కు 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, కాలనీ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి