Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే అభినందన.. శాలువాలతో సత్కారం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 08:45 PM

లోక్ అదాలత్‌లో 6,013 కేసుల పరిష్కారం...

లోక్ అదాలత్‌లో 6,013 కేసుల పరిష్కారం...

లోక్ అదాలత్‌లో 6,013 కేసుల పరిష్కారం...
13-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

లోక్ అదాలత్‌లో 6,013 కేసుల పరిష్కారం...

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రకటన...

నల్లగొండ : ప్రజలకు త్వరితగతిన, వ్యయప్రయాసలు లేకుండా న్యాయం అందించడమే లక్ష్యంగా శనివారం నిర్వహింఛిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయ విభాగం, పోలీస్ శాఖల పరస్పర సమన్వయంతో మొత్తం 6,013 కేసులు విజయవంతంగా పరిష్కారమైనట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. సమగ్ర వివరాల ప్రకారం పరిష్కారమైన కేసుల జాబితా...డ్రంక్ అండ్ డ్రైవ్ (DD) కేసులు: 3,121, ఈ-పెట్టీ (E-Petty) కేసులు: 2,208, ​ఐపీసీ (IPC) కేసులు: 672, ప్రత్యేక చట్టాల (SLL) కేసులు 12, 

కాలయాపన లేని పరిష్కార వేదిక...

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న వివాదాలను, కేసులను ఉభయ పక్షాల పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్‌లు ఎంతో వేదికగా నిలుస్తున్నాయన్నారు. వీటి ద్వారా ప్రజలకు కోర్టుల చుట్టూ తిరిగే సమయం, ఆర్థిక భారం తగ్గడమే కాకుండా న్యాయస్థానాలపై సైతం కేసుల ఒత్తిడి తగ్గుతుందన్నారు. బాధితులు, పౌరులు సుదీర్ఘ న్యాయపోరాటాల నుంచి విముక్తి పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో జరగబోయే లోక్ అదాలత్‌లలోనూ ప్రజలు మరింత చురుగ్గా పాల్గొనాలని కోరారు. రికార్డు స్థాయిలో కేసులను పరిష్కరించేందుకు కష్టపడిన పోలీస్ అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు మరియు న్యాయశాఖ ప్రతినిధులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

లోక్ అదాలత్‌లో 6,013 కేసుల పరిష్కారం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News