వినాయక చవితి వేడుకల్లో నిబంధనలు పాటించాల్సిందే!
వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రామన్నపేట సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్ సూచించారు. విగ్రహాల ప్రతిష్ఠకు ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టి, ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మద్యం, కులం, రాజకీయాలు, ప్రాంతీయ అంశాలతో వివాదాలకు దారితీసే కార్యక్రమాలకు తావివ్వరాదని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి