Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత భవిష్యత్తుకు ఉద్యోగ బాటలు..... కోదాడలో కొలువుల జాతర.... 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 01:38 PM

యువత భవిష్యత్తుకు ఉద్యోగ బాటలు..... కోదాడలో కొలువుల జాతర....

12-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ నెల 19న కోదాడ పట్టణంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ల కృష్ణారావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో భారీ స్థాయిలో జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సుమారు 200 నుంచి 250 ప్రముఖ కంపెనీలను జాబ్‌మేళాకు ఆహ్వానిస్తున్నామని, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ విద్యార్హతలు కలిగిన వారితో పాటు అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కంపెనీల ప్రతినిధులతో నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి అవకాశమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా జాబ్‌మేళాకు హాజరై తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. కోదాడ పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలోని నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా వివరాలను విస్తృతంగా చేరవేసి, అధిక సంఖ్యలో యువత పాల్గొనేలా చొరవ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల సహకారంతో అందుతున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించి తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని రావెళ్ల కృష్ణారావు పిలుపునిచ్చారు. కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి స్కూల్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Sthanikam

యువత భవిష్యత్తుకు ఉద్యోగ బాటలు..... కోదాడలో కొలువుల జాతర....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News