నిరుద్యోగ యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: బొల్లా శివశంకర్
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘ఆసరా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో భారీ మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లా శివశంకర్ తెలిపారు. శనివారం చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేళా వివరాలను వెల్లడించారు. యువతకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు 50కి పైగా ప్రముఖ ఐటీ, సాఫ్ట్‌వేర్, తయారీ, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, రిటైల్, మార్కెటింగ్ సంస్థలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. వీటి ద్వారా వివిధ రంగాల్లో సుమారు 3,000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అర్హత కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సొంత కాళ్లపై నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 27, 2026 (ఆదివారం) సమయం ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తంగడపల్లి, ఈ ఉద్యోగ మేళా ఏర్పాట్లలో ఆసరా ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లా కవిత, కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి