Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 11:06 AM

సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం

సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం

సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం
12-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బీఆర్‌ఎస్ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.

పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ షేపూరి మధుసూధన్.

నల్గొండ: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ నేతలు అనుచిత, అసభ్యకర పదజాలంతో చేసిన వ్యాఖ్యలు హేయమని పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ షేపురి మధుసూధన్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉన్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.

కేటీఆర్ విచారణకు సంబంధించి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌లు లీకులు ఇస్తూ, నిర్దోషులైన పోలీసుల కాలర్ పట్టుకుని అసభ్య పదజాలంతో దూషించిన ఘటనలపై కూడా కేసులు నమోదు చేయాలని మధుసూధన్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందన్నారు.

Sthanikam

సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News