సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అలాగే తెలంగాణ విమోచన పోరాట చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేందుకు ‘తెలంగాణ సప్త సంకల్పాలు’ అమలు చేయాలని బీజేపీ చౌటుప్పల్ మండల శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్ నాయకత్వంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కైరంకొండ అశోక్ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతానికి రజాకార్ల పాలన నుంచి విముక్తి లభించిన చారిత్రక ఘట్టాన్ని ప్రభుత్వం గౌరవించాలన్నారు. భావితరాలకు ఈ పోరాట స్ఫూర్తిని అందించేందుకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహ ఆవిష్కరణ, విమోచన మ్యూజియం ఏర్పాటు, పాఠ్యాంశాల్లో విమోచన చరిత్ర చేరిక, స్మారక వనాల నిర్మాణం, పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి వంటి ‘సప్త సంకల్పాలను’ తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దూడల భిక్షం, గుజ్జుల సురేందర్, చినుకని మల్లేశం, అశోక్, పబ్బతి శేఖర్, దిండు భాస్కర్, కట్ట కృష్ణ, కడారి ఐలయ్య, బోయ సదానంద్, బాతరాజు ధనంజయ, మునుగాలా అమరేందర్ రెడ్డి, లగ్గొని పాండు, ఆల్మసిపేట గౌతమ్, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి – తహసీల్దార్‌కు బీజేపీ వినతి

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి