ప్రాంతీయ పరిశ్రమలలో స్థానిక యువతకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇందుకోసం యువత ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండలంలోని పద్మావతి ఫంక్షన్ హాల్‌లో డీవైఎఫ్‌ఐ మండల మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం యువజన సంఘాలు ఐక్యమై ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు పల్లె మధుకృష్ణ, కౌడి సురేష్, దయ్యాల మల్లేష్, ఎండీ సలీం, మండల అధ్యక్ష కార్యదర్శులు రత్నం శ్రీకాంత్, పల్లె శివకుమార్, గండని లక్ష్మీపతి, బోదాస్ నరేష్, నత్తి నరేష్, జంగిలి సాయి, బాలెం నరేష్, బర్రె రాజు, బర్రె శశి తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్

K.RAVI
ప్రాంతీయ పరిశ్రమలలో స్థానిక యువతకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇందుకోసం యువత ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండలంలోని పద్మావతి ఫంక్షన్ హాల్‌లో డీవైఎఫ్‌ఐ మండల మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం యువజన సంఘాలు ఐక్యమై ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు పల్లె మధుకృష్ణ, కౌడి సురేష్, దయ్యాల మల్లేష్, ఎండీ సలీం, మండల అధ్యక్ష కార్యదర్శులు రత్నం శ్రీకాంత్, పల్లె శివకుమార్, గండని లక్ష్మీపతి, బోదాస్ నరేష్, నత్తి నరేష్, జంగిలి సాయి, బాలెం నరేష్, బర్రె రాజు, బర్రె శశి తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి