సిర్గాపూర్ మండలం ఉజ్లంపాడ్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు తోడే నగేష్, సాదుల సంజీవ్ ముదిరాజ్, దండి యాదయ్యతో పాటు పలువురు నాయకులు నారాయణఖేడ్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బాపుమల్ శెట్టి స్వగృహంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా బాపుమల్ శెట్టి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం బాపుమల్ శెట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే కవిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బహుజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.భూమిలేని నిరుపేదలకు ‘భూలక్ష్మి’ పేరుతో ఎకరం భూమి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమం, బహుజన అభివృద్ధి కోసం పార్టీ కృషి చేస్తుందనే నమ్మకంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మాణిక్యం ముదిరాజ్, సంగమేశ్ చారి, శివరాజ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లోకి బీఆర్‌ఎస్ నేతల చేరిక.. బాపుమల్ శెట్టి స్వాగతం

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి