Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్వేను త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 09:59 PM

తెలంగాణ భాషా వైభవానికి కాళోజీ ప్రతీక

తెలంగాణ భాషా వైభవానికి కాళోజీ ప్రతీక

తెలంగాణ భాషా వైభవానికి కాళోజీ ప్రతీక
09-09-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వివేకానంద విద్యానికేతన్‌లో ఘనంగా కాళోజీ జయంతి.

తెలంగాణ ప్రజల జీవనాడిని తన సాహిత్యంలో ప్రతిబింబించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలోని వివేకానంద విద్యానికేతన్‌ పాఠశాలలో బుధవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మర్రి రామలింగం కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తన పుట్టుక, చావుల మధ్య జీవితాన్ని కేవలం తనకోసం కాకుండా తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల సమస్యలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. కాళోజీ ఆశయాలను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని తెలంగాణ భాషా సంస్కృతుల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దోర్నాల శివ, ఉపాధ్యాయులు శశిరేఖ, రమ, హేమలతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ భాషా వైభవానికి కాళోజీ ప్రతీక

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News