విద్యార్థులు రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు.చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం టౌన్‌లోని అరబిందో జూనియర్ కాలేజ్ సమీపంలో ‘రోడ్ సేఫ్టీ అండ్ యాంటీ డ్రగ్ అవేర్నెస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, కార్లలో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అతివేగం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. అలాగే, సమాజాన్ని వేధిస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. యువత చదువుపై శ్రద్ధ వహించి, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నివారణలో చురుగ్గా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి