Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్ న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 04:58 PM

యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్

09-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

డ్రగ్స్ నిర్మూలనపై అరవిందో జూనియర్ కళాశాలలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సెమినార్

విద్యార్థులు, యువత డ్రగ్స్, గంజాయి వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ మూడవ జిల్లా మహాసభల సందర్భంగా స్థానిక అరవిందో జూనియర్ కళాశాలలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... డివైఎఫ్ఐ యువజన సంఘం కేవలం పోరాటాలకే పరిమితం కాకుండా, సమాజ మార్పు కోసం, యువతకు అవగాహన కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలు, వాడకం కనిపిస్తే వెంటనే పోలీసు యంత్రాంగానికి సమాచారం అందించాలని కోరారు. అలాగే, నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కావద్దని, ఫోన్ల వినియోగం పెరుగుతుండటంతో సైబర్ క్రైమ్ కేసులు కూడా అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ​స్థానిక పరిశ్రమల్లో యువతకు ఉపాధి కల్పించాలి ప్రైవేటు విద్యాసంస్థల జిల్లా అధ్యక్షుడు బత్తుల శంకర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధుకృష్ణ మాట్లాడుతూ... డివైఎఫ్ఐ జిల్లా మూడో మహాసభలను ప్రధానంగా స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కాలుష్యాన్ని అరికట్టడం వంటి ప్రధాన అజెండాతో నిర్వహిస్తున్నామని తెలిపారు. యువజన సమస్యలపై ప్రధానంగా చర్చించి, భవిష్యత్ పోరాట కార్యచరణను రూపొందిస్తామన్నారు. ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా 300 మంది యువ ప్రతినిధులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ​ఈ సెమినార్ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దుర్గయ్య, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ ఖయ్యూం, మండల కార్యదర్శి పల్లె శివకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తీగుళ్ల శ్రీనివాస్, నాయకులు జింకల మహేష్, అధ్యాపకుడు రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News