చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పబ్బు దేవేందర్ ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. పొలిటికల్ సైన్స్ విభాగంలో పరిశోధన పూర్తి చేసిన ఆయనకు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల, వీసీ కుమార్ మొగులారం తదితరుల చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు.
విద్యా రంగంలో పట్టుదలతో పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ సాధించడం పట్ల దేవేందర్ ఆనందం వ్యక్తం చేశారు. తన విజయానికి తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వమే కారణమని తెలిపారు. తాను సాధించిన పీహెచ్‌డీ పట్టాను తన తల్లిదండ్రులు, గురువులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన యువకుడు ఉన్నత విద్యలో డాక్టరేట్ సాధించడంతో వెలిమినేడు గ్రామస్తులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ దేవేందర్‌కు అభినందనలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి