వెలిమినేడులో వర్ధంతి సభను విజయవంతం చేయాలి: రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య.
వెలిమినేడు: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో వీరోచితంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను నేటి తరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని వెలిమినేడు గ్రామ రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య అన్నారు. వెట్టి చాకిరి విముక్తి, భూమి కోసం.. భుక్తి కోసం దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.
వెలిమినేడు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, రజక సంఘం నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అదేవిధంగా ప్రతి గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సభలను నిర్వహించి ఆమె పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గోలి కిష్టయ్య కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి