Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 05:20 PM

డీఈ కుర్చీకే వినతిపత్రం! దుబ్బాక–మునిపంపుల రోడ్డు గుంతలపై సీపీఎం సర్పంచుల వినూత్న నిరసన

08-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దుబ్బాక: రోడ్డు గుంతలు.. ప్రమాదాల మోత.. అధికారుల నిర్లక్ష్యం.. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో సీపీఎం సర్పంచులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్‌అండ్‌బీ డీఈ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఖాళీ కుర్చీకే వినతిపత్రం అందజేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

దుబ్బాక–మునిపంపుల గ్రామాల మధ్య రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదని మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, దుబ్బాక సర్పంచ్ గట్టు నర్సింహా ఆరోపించారు. రోడ్డు గుంతల కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

రోడ్డు మరమ్మతుల కోసం పలుమార్లు అధికారులను కలిసి సమస్యను వివరించినా స్పందన లేకపోవడంతో ఈ వినూత్న నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు. రెండు రోజుల్లో రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే గ్రామాల ప్రజలతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు.

బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆర్‌అండ్‌బీ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకుడు గుండాల నరేష్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్, వేముల మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డీఈ కుర్చీకే వినతిపత్రం! దుబ్బాక–మునిపంపుల రోడ్డు గుంతలపై సీపీఎం సర్పంచుల వినూత్న నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News