హద్నూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులతో హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు హాజరై మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు చిన్నా, పెద్దా తేడా లేకుండా తమ మండపానికి సంబంధించిన పూర్తి వివరాలను policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.గణేష్ విగ్రహం, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల వివరాలతో పాటు అవసరమైన సమాచారాన్ని సక్రమంగా నమోదు చేసి, ఒక జిరాక్స్ ప్రతిని హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని కోరారు.నిర్వాహకులు సకాలంలో పూర్తి వివరాలు అందిస్తే మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల ఆధ్వర్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని సీఐ హనుమంతు కోరారు.
మండపాల వివరాలు సకాలంలో నమోదు చేయండి: సీఐ హనుమంతు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి