ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణకు శ్రీకారం
మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలే లక్ష్యం
బొల్ల శివశంకర్ మాజీ జడ్పిటిసి. మునుగోడు నియోజకవర్గం
మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించి, ఆర్థికంగా స్వావలంబులను చేయాలనే లక్ష్యంతో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. “నైపుణ్యం.. ఆత్మనిర్భరత.. ఆత్మవిశ్వాసం” అనే లక్ష్యంతో మహిళలకు కుట్టుపనిలో శిక్షణ అందించనున్నారు.కుట్టు మిషన్ శిక్షణ ద్వారా మహిళలు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు స్వయం ఉపాధి పొందేందుకు, కుటుంబ ఆర్థిక పరిస్థితికి అండగా నిలిచేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి మెరుగైన భవిష్యత్తు అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు శిక్షణ కేంద్రం ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలోని సేవిత సహకార సంఘ భవనం వద్ద కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఆసరా ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.“మహిళ సాధికారత.. సమాజ అభివృద్ధికి మూలాధారం” అనే సందేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి