జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి. అంజయ్య, కార్యదర్శి ఎం. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ భాష, యాసకు తన రచనల ద్వారా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన కాళోజీ నారాయణరావు ప్రజల్లో చైతన్యం కలిగించిన మహనీయుడని వారు పేర్కొన్నారు. తెలంగాణ భాష మన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, ఆత్మగౌరవానికి ప్రతీక అని, కాళోజీ సాహిత్య సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ భాషా వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా కాళోజీకి ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ.. ఘనంగా జయంతి వేడుకలు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి