Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి మహిళా సమాఖ్యను సందర్శించిన 120 మంది బీహార్ అధికారులు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 07:53 PM

సంగారెడ్డి మహిళా సమాఖ్యను సందర్శించిన 120 మంది బీహార్ అధికారులు

09-09-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు సెర్ప్–ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను బీహార్ రాష్ట్రానికి చెందిన గ్రూప్–1 అధికారుల బృందం ప్రశంసించింది. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ హైదరాబాద్‌లో శిక్షణలో భాగంగా సంగారెడ్డి జిల్లాకు వచ్చిన 120 మంది బీహార్ గ్రూప్–1 అధికారులు జిల్లా మహిళా సమాఖ్యను సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు డీఆర్‌డీఓ అధికారులు సెర్ప్–ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, వాటి ద్వారా మహిళలకు అందుతున్న ప్రయోజనాలను అధికారులకు వివరించారు.అనంతరం మహిళా వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమై వారి అనుభవాలను తెలుసుకున్నారు. మహిళా శక్తి పెట్రోల్ బంక్, వాణిజ్య దుకాణ సముదాయం, ఫసల్వాడిలోని కేఎస్‌ఆర్ సాక్స్ యూనిట్‌ను సందర్శించి మహిళా సంఘాలు నిర్వహిస్తున్న కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలను పెంచడంలో సెర్ప్–మహిళా సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని బీహార్ గ్రూప్–1 అధికారులు పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వతంత్రంగా ఎదిగేలా చేయడంలో ఈ కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య కోశాధికారి, మహిళా సంఘాల సభ్యులు, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, జిల్లా సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డి మహిళా సమాఖ్యను సందర్శించిన 120 మంది బీహార్ అధికారులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News