Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి మహిళా సమాఖ్యను సందర్శించిన 120 మంది బీహార్ అధికారులు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 07:50 PM

జిల్లా పోలీసు కార్యాలయంలో కాళోజీకి ఘన నివాళులు

09-09-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్ డాక్టర్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలుగు సాహిత్యానికి, తెలంగాణ ఉద్యమానికి అక్షరయోధుడిగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ యాసలో సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యేలా తన కవితల ద్వారా ప్రజల సమస్యలను, భావాలను వ్యక్తం చేశారని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కాళోజీ, స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని గుర్తుచేశారు. తెలంగాణ భాష, యాస పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికి గుర్తుగా ప్రభుత్వం ఆయన జయంతిని‘తెలంగాణ భాషా దినోత్సవం’గా నిర్వహిస్తోందన్నారు. అనంతరం అధికారులు, పోలీసు సిబ్బంది కాళోజీ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్‌ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్, డానియెల్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా పోలీసు కార్యాలయంలో కాళోజీకి ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News