Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి మహిళా సమాఖ్యను సందర్శించిన 120 మంది బీహార్ అధికారులు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 07:47 PM

రైల్వే లైన్‌ కోసం లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి మద్దతు

09-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో వెయ్యి కార్డుల అందజేత

సూర్యాపేట మీదుగా రైల్వే మార్గం సాధన కోసం చేపట్టిన లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీ వాసవి సేవా సమితి మద్దతు ప్రకటించింది. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొని వెయ్యి పోస్టుకార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూర్యాపేట మీదుగా రైల్వే మార్గం ఏర్పాటు చేస్తే జిల్లాకు మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే మార్గాన్ని సూర్యాపేట మీదుగా కాకుండా ఇతర మార్గాల్లోకి మళ్లించడం వల్ల జిల్లా అభివృద్ధికి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. సూర్యాపేట మీదుగా రైల్వే మార్గం సాధన కోసం ఉద్యమిస్తున్న రైల్వే సాధన సమితి కన్వీనర్‌ డేగల జనార్ధన్‌ను అభినందించారు.

రైల్వే మార్గం సాధించే వరకు వాసవి సేవా సమితి ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. సూర్యాపేట మీదుగా గతంలో ప్రకటించిన విధంగానే రైల్వే మార్గాన్ని కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే మార్గం సాధనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో రైల్వే సాధన సమితి నిర్వాహకులు బిక్కుమళ్ల ఉపేందర్‌, రాచూరి ప్రతాప్‌, నల్లపాటి అప్పారావు, భద్రయ్య, మంజుల, అంజయ్య, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుండా రమేష్‌, వాసవి సేవా సమితి ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్‌, రాచకొండ శ్రీనివాస్‌, మహంకాళి ప్రణీత్‌, కలకోటి నరసయ్య, సహాయ కార్యదర్శులు కర్నాటి కృష్ణ, బచ్చు శ్రీనివాస్‌, తప్సి అనిల్‌, సోమ ధనుంజయ్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

రైల్వే లైన్‌ కోసం లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి మద్దతు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News