Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి మహిళా సమాఖ్యను సందర్శించిన 120 మంది బీహార్ అధికారులు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 07:50 PM

ప్రజా కవి కాళోజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం:డిప్యూటీ కలెక్టర్

09-09-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా కవి కాళోజీ నారాయణరావు జీవితం, సాహిత్య స్ఫూర్తి, ప్రజా సమస్యలపై ఆయన చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శప్రాయమని డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని బుధవారం మానూర్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ మాట్లాడుతూ.. కాళోజీ తన రచనల ద్వారా ప్రజల సమస్యలు, సామాజిక పరిస్థితులను సమాజం ముందుకు తీసుకువచ్చి ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని నింపారని అన్నారు. సామాన్యుల పక్షాన నిలబడి వారి గొంతుకగా కాళోజీ ప్రజా కవిగా చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. సమాజంలోని అసమానతలు, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ప్రజలను చైతన్యపరిచారని పేర్కొన్నారు. కాళోజీ ఆలోచనా విధానం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన జీవితం, సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణు సాగర్,డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, ఆర్‌ఐ శంకర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాజా మొయినుద్దీన్, రఘురాములు, నర్సింహారెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా కవి కాళోజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం:డిప్యూటీ కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News