శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
నార్కెట్‌పల్లి: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నార్కెట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్యాడ్‌హ్యాట్స్, రౌడీషీటర్లకు బుధవారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడరాదని పోలీసులు స్పష్టం చేశారు. గొడవలు, దౌర్జన్యాలు, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సోదరభావంతో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ఎవరైనా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసి చట్టాన్ని ఉల్లంఘిస్తే, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా కొనసాగిస్తామని తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి