Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి మహిళా సమాఖ్యను సందర్శించిన 120 మంది బీహార్ అధికారులు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 07:52 PM

అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇందిరమ్మ ఇల్లు

09-09-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

టేకుమట్లలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పటేల్‌ రమేష్‌రెడ్డి

ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు.బుధవారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో బొడ్డు హుసేన్‌, రాజేశ్వరి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పటేల్‌ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వారు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాలకు భరోసాగా నిలుస్తోందన్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గట్టు శ్రీనివాస్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి ధరావత్‌ వెంకన్న నాయక్‌, టేకుమట్ల సర్పంచ్‌ గట్టు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇందిరమ్మ ఇల్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News