మిర్యాలగూడ డివిజన్ నుంచి పలువురు PRTU నాయకులు, ఉపాధ్యాయుల చేరిక.
సంఘ బలోపేతానికి కృషి చేస్తాం: రాష్ట్ర అధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్.
నల్లగొండ, సెప్టెంబర్ 9:
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్)లోకి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ డివిజన్‌కు చెందిన పలువురు PRTU నాయకులు, ఉపాధ్యాయులు భారీగా చేరారు. సంఘ సిద్ధాంతాలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తపస్ చేస్తున్న కృషికి ఆకర్షితులై వారు సభ్యత్వం స్వీకరించినట్లు తెలిపారు.
మిర్యాలగూడ డివిజన్ ఇన్‌చార్జి తలకొల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన డివిజన్ సమావేశంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్ సమక్షంలో సభ్యత్వ స్వీకరణ కార్యక్రమం జరిగింది. డివిజన్‌లో బలమైన నాయకులుగా గుర్తింపు పొందిన గుడిపాటి కోటయ్య, ధీరావత్ నర్సింహా నాయక్ ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు తపస్‌లో చేరారు.
ఈ సందర్భంగా అలుగోముల శ్రీనివాస్, డొంకల వెంకటేశ్వర్లు, చిలుక నరేందర్‌రెడ్డి, కర్నాటి రామిరెడ్డి, చనుమోలు లక్ష్మీనారాయణ, ధారగాని జనార్ధన్, బంటు నాగేందర్, బీసం వెంకటేశ్వర్లు, శ్రీనునాయక్, ధూపాటి రాజశేఖర్, నిమ్మనగోటి నాగమణి, ఆవుల వెంకటేశ్వర్లు, దాసరాజు మధుకోడి, చంద్రశేఖర్ తదితరులు సభ్యత్వం స్వీకరించారు.
కొత్తగా చేరిన నాయకులు, ఉపాధ్యాయులు దేశం, ధర్మం, సంఘ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి ఇరుగు శ్రీరామ్, యామిని వెంకటేశ్వర్లు, కొండ లింగయ్య, సాకేత్ రాము, వివిధ మండలాల తపస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి