తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ జి. విట్టల్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎస్.కె. హుస్సేన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండారి, బాలాజీ, హసన్ తదితరులు జి. విట్టల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘం మరింత బలోపేతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సీనియర్ జర్నలిస్ట్‌గా జి. విట్టల్‌కు ఉన్న అనుభవం సంఘానికి ఎంతో ఉపయోగపడుతుందని, నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. జర్నలిస్టులందరినీ ఐక్యంగా తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తనను డివిజన్ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ జి. విట్టల్ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కులు మరియు సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
నూతన బాధ్యతల్లో విట్టల్.. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి