Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్వేను త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 10:40 PM

వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర

09-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

VBYLD–2027 క్విజ్‌లో యువతకు సువర్ణావకాశం.

మై భారత్‌ కేంద్ర జిల్లా యువజన అధికారి గౌతమ్‌రెడ్డి

నల్గొండ, సెప్టెంబర్‌ 9:

దేశాభివృద్ధిలో యువతను భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌ (VBYLD)–2027లో భాగంగా జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు మై భారత్‌ కేంద్ర జిల్లా యువజన అధికారి గౌతమ్‌రెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువత ఈ క్విజ్‌ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. రాజకీయ నేపథ్యం లేని సుమారు లక్ష మంది ప్రతిభావంతులైన యువతీ యువకులను గుర్తించి, 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంలో భాగస్వాములను చేయడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు.తెలుగుతో పాటు దేశంలోని 22 అధికారిక భాషల్లో ఆన్‌లైన్‌ క్విజ్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా క్విజ్‌, వ్యాసరచన, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మొత్తం ఐదు దశల్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. తుది విజేతలకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి డైలాగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో దేశాభివృద్ధికి సంబంధించిన తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించే అరుదైన అవకాశం దక్కుతుందని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.ఆసక్తి గల యువత సెప్టెంబర్‌ 30, 2026లోపు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. యువత తమ ప్రతిభను చాటుకోవడంతో పాటు దేశ భవిష్యత్‌ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ రమణారెడ్డి, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ కోటయ్య, కొండ నాయక్‌, బాబురావు, ప్రసాద్‌, వెంకటేష్‌, యూత్‌ వాలంటీర్‌ నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News