ఉరుముడ్లలో ఘనంగా వర్ధంతి నివాళులు.
చిట్యాల: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని చిట్యాల మండలం ఉరుముడ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అయితరాజు నరసింహ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. దొరలు, దేశ్‌ముఖులు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ఆమె ధైర్యంగా పోరాడి అణగారిన వర్గాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతి మహిళ ఐలమ్మ స్ఫూర్తితో హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, సీపీఎం గ్రామ కార్యదర్శి బెల్జం మల్లయ్య, రజక సంఘం ఉపాధ్యక్షుడు నడపరాజు వెంకట్ రాములు, చెరుకు శంకర్, గుత్త రవీందర్‌రెడ్డి, అయితరాజు పెద్ద నరసింహ, చెరుకు అండాలు, నిర్మల, సాగర్ల సీతమ్మతో పాటు పలువురు మహిళలు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి