పెళ్లి మాటిచ్చి మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు.. ఉప్పల్ పీఎస్‌లో కేసు
హైదరాబాద్:
పదేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, మరో యువతిని వివాహం చేసుకున్నాడంటూ ఓ కానిస్టేబుల్‌పై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్‌కు చెందిన అరుణ్‌కు బాధిత యువతితో ఎంటెక్ చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆమె అతడిని నమ్మింది. ఈ క్రమంలో పలుమార్లు గర్భం దాల్చగా.. ప్రస్తుతం పిల్లలు వద్దంటూ అబార్షన్లు చేయించినట్లు యువతి ఆరోపించింది.
నవంబర్ 1న పెళ్లి చేసుకునేందుకు ఫంక్షన్ హాల్‌కు రూ.50 వేల అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు తెలిపింది. అయితే జూలై 1న అరుణ్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి