వెలిమినేడులో ఘనంగా 41వ వర్ధంతి కార్యక్రమం.
చిట్యాల: భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరి విముక్తి కోసం అణగారిన వర్గాల హక్కుల సాధనకు అలుపెరుగని పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని రజక సంఘం నాయకులు కొనియాడారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య ఆధ్వర్యంలో గురువారం చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గోలి కిష్టయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలతో పోరాడి అణగారిన వర్గాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి నరసింహ, రజక సంఘం ప్రధాన కార్యదర్శి గుండెపూరి చంద్రయ్య, ఉపాధ్యక్షుడు గోలి నరసింహ, వార్డు సభ్యులు చిరుగోని శ్రీశైలం, లోడే చిరంజీవి, ఏనుగు శ్రీకాంత్‌రెడ్డి, దేశబోయిన మంజుల, మల్లేష్, చింతకింది వెంకటేష్, మహంకాళి కుమారస్వామి, గ్రామ నాయకులు చీమల వీరేశం, వెల్ది రాఘవరెడ్డి, ఏనుగు సుధాకర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాతి శ్రీనివాస్, కాటం సత్తయ్య, సుర్కంటి మోహన్‌రెడ్డి, ఆరూరి శ్రీనివాస్, దేశబోయిన నరసింహ, అంతటి రాజు, అంశాల శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రజక సంఘం కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాములు, గోలి ఆంజనేయులు, రజక సంఘం నాయకులు గోలి శంకరయ్య, గోలి నరసింహ, గోలి దుర్గయ్య, గోలి సాయికిరణ్, గోలి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి