Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 12:56 PM

‘రుద్రమదేవి’పై పరిశోధనకు అరుదైన గుర్తింపు.. విఠల్‌కు పీహెచ్‌డీ

10-09-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కోహీర్ మండలం గురుజువాడ గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు సి.హెచ్. విఠల్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. తెలుగు సాహిత్యంలో ‘రుద్రమదేవి’ అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గుర్తింపుగా పీహెచ్‌డీ లభించింది. మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో విఠల్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం. ఎల్లా ముఖ్య అతిథిగా హాజరై ఆయనకు పట్టాను అందజేశారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ శివప్రతాప్ శుక్లా అధ్యక్షత వహించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన విఠల్ పట్టుదలతో చదువుతూ, పరిశోధనలో రాణించి డాక్టరేట్ సాధించడం విశేషం. ఆయన సాధించిన ఈ ఘనత గురుజువాడ గ్రామంతో పాటు కోహీర్ మండలానికి గర్వకారణంగా నిలిచింది. విఠల్ విజయాన్ని పురస్కరించుకుని గురువులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

Sthanikam

‘రుద్రమదేవి’పై పరిశోధనకు అరుదైన గుర్తింపు.. విఠల్‌కు పీహెచ్‌డీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News