వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని ఆమె విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ పాండు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.ఆమె ధైర్యసాహసాలు, తెగువ, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆమె ఆశయాలను స్మరించుకోవడంతో పాటు, సమాజ అభివృద్ధి కోసం వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి